• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తే గుర్తింపు రద్దు’

ఈనాడు, హైదరాబాద్‌: విద్యా క్యాలెండరును ప్రకటించనందున రాష్ట్రంలో దోస్త్‌, దాని పరిధిలోని డిగ్రీ కళాశాలలు ప్రవేశాలను నిర్వహించొద్దని యాజమాన్యాలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కొన్ని యాజమాన్యాలు డిగ్రీ ప్రవేశాలు జరుపుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి హెచ్చరించారు.