• facebook
  • whatsapp
  • telegram

జ్యోతిబా ఫులే బీసీ గురుకుల దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఆగ‌స్టు 20 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశపరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.