• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక టెక్నాలజీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ

మాచవరం, (విజయవాడ) న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐడీఎస్‌ ఇన్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు నుంచి క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, బ్లాక్‌ ఛైన్‌ టెక్నాలజీలపై ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 9లోపు  www.apssdc.in లో నమోదు చేసుకోవాలని సంస్థ ఈడీ తెలిపారు. వివరాలకు 1800 4252422కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చన్నారు.