• facebook
  • whatsapp
  • telegram

7,160 పాఠశాలలకు గణితం, సైన్సు కిట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 7,160 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గణితం, సామాన్యశాస్త్ర (సైన్స్‌) భావనలు సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రీయ ఆవిష్కార్‌ అభియాన్‌ కింద రూ.3.46 కోట్ల విలువైన ఉపకరణాలను జిల్లా విద్యాశాఖకు పంపించింది. ప్రాథమికోన్నత పాఠశాలల గణితం కిట్‌కు రూ.1,661, సామాన్యశాస్త్రం కిట్‌కు రూ.7,639, ఉన్నత పాఠశాలల గణితం కిట్‌కు రూ.1,907, సామాన్యశాస్త్రం కిట్‌కు రూ. 10,947 చొప్పున వెచ్చించి బోధనోపకరణాలను కొనుగోలు చేసింది. పాఠశాలలు తెరవగానే వీటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.