• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌నకు 20 శాతం క్రెడిట్లు  

* యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ
ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని అమలు చేసే దిశగా యూజీసీ కదులుతోంది. డిగ్రీలోని మొత్తం క్రెడిట్లలో కనీసం 20 శాతం క్రెడిట్లు కేటాయించనుంది. ఈ మేరకు యూజీసీ ఆగస్టు 7న‌ ‘అప్రెంటిస్‌షిప్‌/ఇంటర్న్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌-2020’ పేరిట కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఒక సెమిస్టర్‌ వ్యవధిని ఇంటర్న్‌షిప్‌/అప్రెంటిస్‌షిప్‌నకు కేటాయించాలి. వాటిని అందించేందుకు ఉన్నత విద్యాసంస్థలు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.