• facebook
  • whatsapp
  • telegram

కొత్త నైపుణ్యాల మనుగడ 2-3 ఏళ్లే

* నాస్కామ్‌ ఛైర్మన్‌ ప్రవీణ్‌ రావు
 

బెంగళూరు: కొత్త నైపుణ్యాలకు ఇప్పుడు రెండు నుంచి మూడేళ్ల పాటు మాత్రమే ప్రాధాన్యం దక్కుతోందని, అందువల్ల ఉద్యోగులు కొత్త పరిజ్ఞానాలను జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ ఛైర్మన్‌ యూబీ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఎప్పటికప్పుడు పునరుత్తేజం అవుతున్నాయని, ఉద్యోగులు సైతం మనుగడ కోసం తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రవీణ్‌రావు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఓఓగా వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ఉన్నత విద్య సంస్థ అప్‌గ్రేడ్‌, ఐఐటీ బెంగళూరు సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యంత్రాలు, ఆల్గారిథమ్స్‌లు కొత్తగా 1.33 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా జీవితాంతం నేర్చుకోవడానికి కట్టుబడి ఉండాలని, ఉద్యోగంలో కొనసాగడానికి ఇది చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.