• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌ఆర్‌ఎం బీటెక్‌ ప్రవేశాలకు ర్యాంకుల విడుదల

గ్రామీణ మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని నీరుకొండ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఈ ఏడాది బీటెక్‌ అడ్మిషన్ల కోసం విద్యార్థులకు ర్యాంకుల్ని విడుదల చేసింది. కరోనా కారణంగా ఎస్‌ఆర్‌ఎం ఈ ఏడాది జేఈఈఈ పరీక్షను రద్దు చేసి ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. త్వరలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు 91(044)27455510 నంబరులో సంప్రదించాలంది.