• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరి 14న ఐఐటీ జామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ఎంఎస్‌సీ, ఎంఎస్‌సీ-పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్‌ అడ్మిషన్‌ టెస్టు ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌)-2021ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న నిర్వహించనున్నారు. ఈ సారి పరీక్ష నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) తీసుకుంది. అభ్యర్థులు సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి.