• facebook
  • whatsapp
  • telegram

సొంతూరుకు దగ్గర్లో పరీక్ష కేంద్రం

* చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్‌ అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో బీటెక్‌, బీఫార్మసీ చివరి ఏడాది విద్యార్థులు సొంతూరుకు దగ్గర్లో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే వీలును జేఎన్‌టీయూ-హెచ్‌ కల్పించింది. ఇందుకుగాను విద్యార్థులు మూడు కళాశాలలను ఐచ్ఛికాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్‌ లేదా ఫార్మసీ కళాశాల అయి ఉండాలి. అధికారులు అందులో ఒకదాన్ని పరీక్ష కేంద్రంగా కేటాయిస్తారు. ఈ మేరకు వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం సంచాలకుడు వి.కామాక్షీప్రసాద్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఇచ్చిన ఐచ్ఛికాల్లో సీటింగ్‌ సామర్థ్యం లేకపోతే సొంత కళాశాలలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.