• facebook
  • whatsapp
  • telegram

పరీక్షలు రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు: యూజీసీ

దిల్లీ: కరోనా దృష్ట్యా విద్యా సంస్థల్లో తుది పరీక్షలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఆగ‌స్టు 10న‌ సుప్రీంకోర్టులో వాదించింది. చివరి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించింది. డిగ్రీలు ఇచ్చే అధికారం కేవలం యూజీసీకి మాత్రమే ఉందని తెలిపింది.