• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ-ఎంలో ‘బయోమిమిక్రీ’ కోర్సు

వడపళని, న్యూస్‌టుడే: బయోమిమిక్రీ అనే కొత్త కోర్సును అందుబాటులోకితెచ్చేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-మద్రాస్‌’ (ఐఐటీ-ఎం) సన్నాహాలు చేస్తోంది. ఫుల్‌ సెమిస్టర్‌ పద్ధతిలో ఈ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు ఐఐటీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు బయాలజీ, ఇంజినీరింగ్‌ కలయికలా ఉంటుందని, చదవాలనుకునే వారు ఆ విభాగాలకు చెందినవారే కావాల్సిన అవసరం లేదని.. కుతూహలం ఉంటే చాలని చెప్పారు. కోర్సులో చేరాలనుకునే వాళ్లు 91766 12393 నంబరులో, లేదా shiva@thinkpaperclip.com ఈమెయిల్‌ ఐడీలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.