• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంపు

అమరావతి: ఏపీలో వైద్య విద్యార్థుల ఉపకార వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఆగ‌స్టు 12న‌ ఉత్తర్వులు జారీచేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థుల ఉపకారవేతనాన్ని రూ.19,589లకు పెంచింది. అలాగే, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ. 44,075, రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524, మూడో సంవత్సరం విద్యార్ధులకు 48973లకు పెంచుతున్నట్టు తెలిపింది. అలాగే, పీజీ డిప్లొమా తొలి సంవత్సరం విద్యార్థులకు రూ.44,075, రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524; సూపర్‌ స్పెషాలిటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.48,973;  రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ. 51,442లు,  మూడో సంవత్సరం విద్యార్ధులకు 53,869; ఎండీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు 44,075; రెండో సంవత్సరం విద్యార్థులకు 46524, మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973ల చొప్పున చెల్లించనున్నట్టు ప్రభుత్వం  వెల్లడించింది.