• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ ప్రవేశాల గడువు నవంబరు 15

* వీసీల సమావేశంలో ఏఐసీటీఈ ఛైర్మన్‌
ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు తుది గడువును అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మరోసారి పొడిగించనుంది. బీటెక్‌, బీఫార్మసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలను నవంబరు 15వ తేదీలోపు పూర్తిచేయాలని ఏఐసీటీఈ ఛైర్మన్‌ సహస్రబుద్ధే తెలిపారు. ఆయన తాజాగా దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దాదాపు 120 వర్సిటీల ఉపకులపతు(వీసీ)లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ నుంచి రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ హాజరయ్యారు.