• facebook
  • whatsapp
  • telegram

సీపెట్‌ ఫలితాల విడుదల

చర్లపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌స్టు 5న ఆన్‌లైన్‌లో నిర్వహించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ(సీపెట్‌) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. 6 వేల మంది హాజరవగా 4,600 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఆగ‌స్టు  18వ తేదీ తుది గడువుగా నిర్ణయించామన్నారు. ప్రవేశానుమతి లేఖలు (అడ్మిషన్‌ లెటర్లు) విద్యార్థులు నమోదు చేసుకున్న మెయిల్‌ ఐడీకి పంపుతామని, సందేహాలుంటే 99593 33415, 99520 46851, 83740 64444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.