• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 15 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

ఈనాడు, అమరావతి: ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌లను ఒకే వారంలో పూర్తి చేయనున్నారు. అక్టోబరు 15 నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. అనంతరం డిగ్రీ ఒకటి, రెండు సంవత్సరాలు, బీటెక్‌ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోపు డిగ్రీ, పీజీ, బీటెక్‌ చివరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేయనున్నారు.