• facebook
  • whatsapp
  • telegram

‘విజ్ఞాన్‌’లో ఆన్‌లైన్‌ తరగతులకు శ్రీకారం

పొన్నూరు, న్యూస్‌టుడే: ‘విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ’లో ప్రవేశం పొందిన బీటెక్‌ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించినట్టు విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి వద్దనున్న వర్సిటీలో ఆగస్టు 13న‌ నిర్వహించిన తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లెర్నింగ్‌’, ‘సైబర్‌ సెక్యూరిటీ’, ‘కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌’, ‘రోబోటిక్స్‌ ఆటోమేషన్‌’ వంటి 4 కొత్త కోర్సులను ఆరంభించినట్లు వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో పెద్ద వేతనాలతో తమ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడం తమకెంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌.రఘునాథన్‌, ఆయావిభాగాల డీన్లు పాల్గొన్నారు.