• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ మార్కుల పునఃపరిశీలన వివరాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ మార్కుల పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మార్కుల పునఃలెక్కింపు, పునఃపరిశీలన కోసం సుమారు 37వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.