• facebook
  • whatsapp
  • telegram

జూన్‌ 27న సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాదికి సంబంధించి పలు జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షలు, నోటిఫికేషన్ల జారీ తేదీలను యూపీఎస్‌సీ ఖరారు చేసింది. మొత్తం 23 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఆగ‌స్టు 17న వెబ్‌సైట్లో ఉంచింది. 2021 సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష(ప్రిలిమ్స్‌) వచ్చే ఏడాది జూన్‌ 27న, ప్రధాన పరీక్ష(మెయిన్‌) సెప్టెంబరు 17వ తేదీ నుంచి అయిదు రోజులపాటు జరుపుతామని ప్రకటించింది.