• facebook
  • whatsapp
  • telegram

665 పోస్టులకు 5,173 దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 665 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (ఎంబీబీఎస్‌ అర్హత) పోస్టుల భర్తీలో భాగంగా ఆగ‌స్టు 17న  ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును ప్రకటించారు. మొత్తం 5,173 దరఖాస్తులొచ్చాయి. మార్కులు, ఇతర నిబంధనలను అనుసరించి రూపొందించిన ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారంలోగా తెలియచేయాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ అరుణ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో జాబితాను అందుబాటులో ఉంచారు.