• facebook
  • whatsapp
  • telegram

2021లో పరీక్షల తేదీలను ఖరారు చేసిన యూపీఎస్‌సీ

* జూన్‌ 27న సివిల్స్‌ ప్రిలిమ్స్‌
* ఈ ఏడాది పరీక్షలూ 2021లోనే

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాదికి సంబంధించి పలు జాతీయస్థాయి ఉద్యోగ పరీక్షలు, నోటిఫికేషన్ల జారీ తేదీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) ఖరారు చేసింది. మొత్తం 23 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఆగ‌స్టు 17న వెబ్‌సైట్లో ఉంచింది. 2021 సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష(ప్రిలిమ్స్‌) వచ్చే ఏడాది జూన్‌ 27న, ప్రధాన పరీక్ష(మెయిన్‌) సెప్టెంబరు 17వ తేదీ నుంచి అయిదు రోజులపాటు జరుపుతామని ప్రకటించింది.
ఈ ఏడాదివి..వచ్చే సంవత్సరంలో
ఈ ఏడాది జరగాల్సిన రెండు ప్రధాన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రధాన పరీక్షలు వచ్చే ఏడాది జరగనున్నాయి. సివిల్స్‌-2020 మెయిన్‌ వచ్చే ఏడాది జనవరి 8, 9, 10, 16, 17 తేదీల్లో (వాయిదా పడిన సివిల్స్‌-2020 ప్రిలిమ్స్‌ అక్టోబరు 4వ తేదీన జరగనుంది)జరుగుతాయి. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌-2020 ప్రధాన పరీక్షలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు.