• facebook
  • whatsapp
  • telegram

‘కంప్యూటరు’ మూల్యాంకనంపై జేఎన్‌టీయూహెచ్‌ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్యులు ఇళ్లలోనే ఉండి కంప్యూటర్‌ తెరల(ఆన్‌స్క్రీన్‌)పై విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసే విధానంపై జేఎన్‌టీయూహెచ్‌ దృష్టి సారించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుసరించి పలు పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబరులో నిర్వహించే జేఎన్‌టీయూహెచ్‌ చివరి ఏడాది పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనాన్ని కూడా అదేవిధానంలో పూర్తిచేయాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.