• facebook
  • whatsapp
  • telegram

స్టడీ మెటీరియల్‌ విక్రయించే కళాశాలలపై చర్యలు

ఈనాడు, అమరావతి: ప్రవేశాల సమయంలో స్టడీ మెటీరియల్‌ కొనుగోలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేసే ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటనలో హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని వెల్లడించారు. ఫిర్యాదులుంటే 93932 82578 నంబరుకు వాట్సప్‌ ద్వారా,  మెయిల్‌ చేయొచ్చని సూచించారు.