• facebook
  • whatsapp
  • telegram

తొమ్మిది ఉత్తమ వర్సిటీల్లో ‘వీఐటీ’

వడపళని, న్యూస్‌టుడే: షాంఘై ర్యాంకింగ్‌ కన్సల్టెన్సీ విడుదల చేసిన అకడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌(ఏఆర్‌డబ్ల్యూయూ)లో వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ)కి ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ర్యాంకు లభించింది. భారతదేశం నుంచి ఉన్న అత్యుత్తమ 15 వర్సిటీల్లో మొదటి తొమ్మిది వర్సిటీల్లో వీఐటీ ఉందని వర్సిటీ కులపతి డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ తెలిపారు. ఇది వీఐటీలోని బోధనా సిబ్బంది, పరిశోధనలు, విద్యార్థుల శ్రమకు లభించిన ఫలితంగా ఆయన పేర్కొన్నారు.