• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ఆర్‌జేసీ దరఖాస్తుకు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కళాశాల(టీఎస్‌ఆర్‌జేసీ)ల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును సెప్టెంబరు 5వ తేదీ వరకు పొడిగించినట్లు కార్యదర్శి వెంకటేశ్వర శర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కళాశాలలున్నాయి. మరిన్ని వివరాలకు040- 24734899, 9490967222 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు.