• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ విద్య మార్గదర్శకాలపై పుస్తకాలు విడుదల

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్‌/ ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించిన మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ‘ప్రాజ్ఞత' పేరిట 46 పేజీలతో పుస్తకాలను విడుదల చేసింది. వివిధ విధానాల్లో పాఠాలను అభ్యసించాల్సిన తీరును పేర్కొంటూ తెలుగు, ఆంగ్ల భాషల్లో దీన్ని రూపొందించారు.