• facebook
  • whatsapp
  • telegram

పీజీ మెడికల్‌ డెంటల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పీజీ మెడికల్‌ డెంటల్‌ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అదనపు విడత నోటిఫికేషన్‌ ఆగ‌స్టు 20న విడుదల చేసింది. ఆగ‌స్టు 21న ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ‌ www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.