• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ మార్కులతో ఎంబీఏ మిగులు సీట్ల భర్తీ

* వెసులుబాటు కల్పించిన ఏఐసీటీఈ
ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీఏ ప్రవేశాల్లో మిగులు సీట్లను డిగ్రీ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) వెసులుబాటు కల్పించింది. ఏటా మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో క్యాట్‌, సీమ్యాట్‌, జీమ్యాట్‌, ఏటీఎంఏ, ఎక్స్‌ఏటీతో పాటు ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు జరుగుతుంటాయి. కరోనా నేపథ్యంలో సంబంధిత ప్రవేశ పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచించింది. ఇదే సమయంలో మిగులు సీట్లను యూజీ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేసుకోవచ్చంది.