• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.braouonline.in లేదా ‌www.braou.ac.in  లో చూడవచ్చన్నారు.