• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 16 నుంచి యూజీసీ నెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన పలు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల కొత్త తేదీలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ఆగ‌స్టు 21న‌ ప్రకటించింది. సంబంధిత పరీక్షలు నిర్వహించుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని పేర్కొంది. జూన్‌ విడతలో జరగాల్సిన యూజీసీ నెట్‌ పరీక్షను సెప్టెంబరు 16-18, 21-25 తేదీల్లో నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి 15 రోజులు ముందుగా వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇతర ముఖ్యమైన ప్రవేశ పరీక్షల వివరాలివీ..