• facebook
  • whatsapp
  • telegram

అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవంబరు 2 నుంచి 13వ తేదీ వరకు గ్రూప్‌ 1 ప్రధాన పరీక్షలను రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు.. వారు హాజరవ్వాలనుకుంటోన్న పరీక్ష కేంద్రాలు మూడింటిని ప్రాధాన్య క్రమంలో సెప్టెంబర్‌ పదో తేదీలోపు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పేర్కొనాలని ఏపీపీఎస్సీ సూచించింది.