• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు చివరలో ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు

నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం, పీయూసీ రెండో సంవత్సర పరీక్షలు సెప్టెంబరు ఆఖరి వారంలో నిర్వహించనున్నట్లు కులపతి ఆచార్య కె.సి.రెడ్డి తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలను తమ ఇళ్ల వద్ద నుంచి లేదా క్యాంపస్‌లో రాసుకోవచ్చని తెలిపారు.