• facebook
  • whatsapp
  • telegram

మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు గడువు అక్టోబరు 31

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 31వ తేదీ వరకు గడువు ఉంది. ఈ ఉపకారవేతనాలకు ప్రాథమికంగా ఎంపికైన 52,740 మంది ఇంటర్‌ విద్యార్థుల పేర్లను తెలంగాణ ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచామని, సంబంధిత అభ్యర్థులంతా scholarships.gov.in పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒప్పంద అధ్యాపకుల కొనసాగింపునకు అనుమతి
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని 3,970 మంది ఒప్పంద, పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు 2020-21 విద్యా సంవత్సరంలోనూ పనిచేసేందుకు వీలు కల్పిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.