• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థుల్లో ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఉపాధ్యాయులకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు విద్యాశాఖ, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌, యూనిసెఫ్‌ ఇంక్విలాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని ఆమె చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లోని 6-10 తరగతుల విద్యార్థులకు నిర్వహించే ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు.