• facebook
  • whatsapp
  • telegram

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆగ‌స్టు 31, సెప్టెంబ‌రు 1న‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. అభ్యర్థులు జూమ్‌ కాన్ఫరెన్స్‌కు 15 నిమిషాల ముందు cfw.ap.nic.in  వెబ్‌సైట్‌లో ఉంచిన ఐడీ, పాస్‌వర్డ్‌ ప్రకారం పాల్గొనాలని ఓ ప్రకటనలో సూచించింది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు, ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.