• facebook
  • whatsapp
  • telegram

పోస్టులు 3.. దరఖాస్తులు 3,500

* అభ్యర్థులు అందజేసిన దరఖాస్తులు
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు, పట్టణ సమన్వయకర్తల పోస్టులకు డిమాండ్‌ నెలకొంది. దరఖాస్తు దాఖలుకు ఆగ‌స్టు 31 ఆఖరి రోజు. ఈ ఒక్కరోజే 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మూడు పోస్టులకు కలిపి 3,500 దరఖాస్తు వచ్చాయని అధికారులు తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తులను వారం రోజుల్లో పాటు పరిశీలన చేస్తారు. ఆ తర్వాత అర్హతను బట్టి పోస్టులను కేటాయిస్తారు. అయితే ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి పోస్టుల కేటాయింపు జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది.