• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ పరీక్షలు ప్రారంభం

* పరీక్షల నిర్వహణను పరిశీలిస్తున్న అధికారులు
ఎస్కేయూ, న్యూస్‌టుడే: తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎస్కేయూలో ఆగ‌స్టు 31 నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభించారు. సెప్టెంబ‌రు 10 వరకు బ్రాంచిల వారీగా నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక బెంచీకి ఒకరిని మాత్రమే కూర్చోబెట్టారు. ప్రతి విద్యార్థి ఆరు అడుగుల దూరం ఉండేలా బల్లలు ఏర్పాటు చేశారు. బాలురకు వర్సిటీ అతిథి గృహం, బాలికలకు ఎంబీఏ క్వార్టర్స్‌లో బస చేయడానికి అవకాశం కల్పించారు. పరీక్షలను రెక్టార్‌ కృష్ణానాయక్‌, రిజిస్ట్రార్‌ మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్స్‌ చింతా సుధాకర్‌, ప్రధానాచార్యులు డాక్టర్‌ రామచంద్ర పరిశీలించారు.