• facebook
  • whatsapp
  • telegram

20 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు

జిల్లా సచివాలయం: సెప్టెంబరు 20 నుంచి 26వ తేదీ వరకు గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ డాక్టర్‌ సిరి (సచివాలయ, అభివృద్ధి) ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆగ‌స్టు 31న‌ కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ జడ్పీలోని డీపీసీ భవనంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేశామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బందికి సెప్టెంబ‌రు 7, 8, 16, 17 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని జేసీ ఆదేశించారు.