• facebook
  • whatsapp
  • telegram

‘ఓయూ ఇంజినీరింగ్‌’లో ఆన్‌లైన్‌ మూల్యాంకనం

ఈనాడు, హైదరాబాద్‌: ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం విధానం అమలు చేయబోతున్నారు. ఇంకా పలు కీలక మార్పులకు కళాశాల అకడమిక్‌ కౌన్సిల్‌ తాజాగా ఆమోదముద్ర వేసింది. బీటెక్‌ మైనింగ్‌ కోర్సును గత ఏడాదే ప్రవేశపెట్టాలని భావించినా ఈ ఏడాది కూడా ఆమోదించలేదు. పీజీలో ఇప్పటికే ఈ కోర్సు ఉంది. యూజీ స్థాయిలో ఈ కోర్సు లేకుండా పీజీ కోర్సు ఎలా నడుస్తుందన్న చర్చ జరిగింది.
ఆమోదం పొందిన నిర్ణయాలు..
* ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో భాగంగా.. పరీక్షల అనంతరం జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో ఆచార్యులకు పంపిస్తారు. వారు ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచైనా వాటిని మూల్యాంకనం చేయడానికి వీలు కల్పిస్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సాఫీగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి సకాలంలో ఫలితాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
* కొత్తగా ఎంటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ అండ్‌ ఎంల్‌) కోర్సు ప్రారంభానికి అనుమతి.