• facebook
  • whatsapp
  • telegram

లాటరీ విధానంలో ఐదో తరగతి ప్రవేశాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాలను ఈ సంవత్సరం లాటరీ విధానంలో చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో ప్రోగ్రామింగ్‌ను రూపొందించి, దాని ద్వారా లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. బీసీ గురుకులాలు ఈనెల 5వ తేదీ వరకు, గిరిజన గురుకులాల సొసైటీ సెప్టెంబ‌రు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ దరఖాస్తు గడువును 15 వరకు పొడిగించింది..