• facebook
  • whatsapp
  • telegram

గ్రేడ్లు రద్దు.. పరీక్షలకే మొగ్గు

* హెచ్‌సీయూ అనూహ్య నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌:
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. సెప్టెంబ‌రు 16 నుంచి ఆన్‌లైన్‌లో చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వీటికి హాజరు కాలేని విద్యార్థులకు అక్టోబరు 5 నుంచి మరోసారి నిర్వహిస్తామని ప్రకటించింది. వాస్తవానికి వర్సిటీలో అన్ని కోర్సుల్లో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తూ గత సెమిస్టర్లలో సాధించిన మార్కులతో పాటు చివరి సెమిస్టర్‌లోని అంతర్గత మూల్యాంకనం ఆధారంగా జూన్‌ 21న గ్రేడ్లు కేటాయించింది. ఇప్పటికే ఆయా గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులు ఉన్నత చదువులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. చివరి సంవత్సరం చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని ఆగ‌స్టు 28న సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రెండు రోజులు కిందట యూజీసీ అన్ని వర్సిటీలను ఆదేశించింది. ఈ క్రమంలో గ్రేడ్లను రద్దు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీయూ వీసీ ప్రొ.పొదిలె అప్పారావు ప్రకటించారు.