• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌కు 77 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబ‌రు 2న  జరిగిన పాలిసెట్‌కు 77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 73,918 మంది దరఖాస్తు చేయగా వారిలో 56,814 మంది పరీక్ష రాశారు. బాలురు 80 శాతం, బాలికలు 74 శాతం మంది హాజరయ్యారని కన్వీనర్‌ డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 11,980 సీట్లు, ప్రైవేట్‌ కళాశాలల్లో 18,780 సీట్లున్నాయి. వాటితోపాటు జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అగ్రికల్చర్‌ డిప్లొమా సీట్లు 870 అందుబాటులో ఉన్నాయి.