• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ పాఠాలకు ఆటంకాలు లేకుండా చూడండి

* విద్యాశాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వల్ల విద్యాసంస్థలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా మొదలుపెట్టిన డిజిటల్‌, ఆన్‌లైన్‌ పాఠాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ విద్యపై సెప్టెంబ‌రు 2న  అధికారులతో మంత్రి సమీక్షించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తితే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యారంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ తరగతుల పాఠాల సమయం, ఇతర మార్గదర్శకాలను ప్రైవేట్‌ పాఠశాలలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ తదితరులు పాల్గొన్నారు.