• facebook
  • whatsapp
  • telegram

జేఎన్‌టీయూ పరీక్ష టైంటేబుల్‌లో స్వల్ప మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ ప్రకటించిన పరీక్షల సమయసారిణి(టైంటేబుల్‌)లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం సైతం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత సెప్టెంబ‌రు 16 నుంచి 25 వరకు చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబ‌రు 21న జరగాల్సిన బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు 20వ తేదీన, 23న జరగాల్సినవి 27న నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 21కు బదులుగా 20వ తేదీన, 23న జరగాల్సినవి 27న ఉంటాయని ప్రకటించింది. మారిన షెడ్యూల్‌ వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పరీక్షల విభాగం సంచాలకుడు వి.కామాక్షిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.