• facebook
  • whatsapp
  • telegram

‘మను’ ప్రవేశ పరీక్షలు వాయిదా

గచ్చిబౌలి న్యూస్‌టుడే: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మను) ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సిద్దీఖి మహ్మద్‌ మహమూద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  సెప్టెంబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్షలను కొవిడ్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.