• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ పరీక్షలకు 75% మందికిపైగా హాజరు

ఈనాడు, దిల్లీ : జేఈఈ మెయిన్‌ పరీక్షలకు మూడురోజుల్లో 75% మందికిపైగా విద్యార్థులు హాజరైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.  సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున జరిగిన పరీక్షలకు మొత్తం 4,58,521 మంది విద్యార్థులు నమోదుచేసుకోగా, 3,43,956 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. తొలిరోజు 54.67% మందే  హాజరైనప్పటికీ, మిగిలిన రెండురోజులు అది 81.08%, 82.14%కి పెరిగిందన్నారు.