• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఈసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈ సెట్‌-2020 ప్రాథమిక కీ విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల్లోగా తెలపాలని కన్వీనర్‌ సూచించారు. అభ్యంతరాలను ఆన్‌లోనే పంపించాలని విద్యార్థులకు తెలియజేశారు. గత నెల 31న రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.