• facebook
  • whatsapp
  • telegram

నాటా-1లో 19,079 మంది ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: అయిదేళ్ల బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)-1లో 19,079 మంది కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 29న ఆన్‌లైన్‌ పరీక్ష జరగగా 30,245 మందికి 22,843 మంది హాజరయ్యారు. వారిలో 9,598 మంది ఇళ్ల నుంచే పరీక్ష రాశారు. తాజాగా ఫలితాలను విడుదల చేయగా 19,079 మంది(83.52 శాతం) అర్హత సాధించారు. ఇంటి నుంచి పరీక్ష రాసిన 357 మంది అవకతవకలకు పాల్పడటంతో వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. నాటా-2 సెప్టెంబ‌రు 12వ తేదీన జరగనుంది. ఆ రెండింటిలో అధిక స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ ర్యాంకులు వెల్లడించనుంది.