• facebook
  • whatsapp
  • telegram

‘ఎన్‌బీఈలో కటాఫ్‌ 30 శాతంగా మార్చాలి’

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విదేశాల్లో చదివిన మెడికల్‌ గ్రాడ్యుయేట్లకు జాతీయ స్థాయిలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే అర్హత పరీక్ష నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ)లో కటాఫ్‌ మార్కులు 30 శాతంగా నిర్ణయించాలని ‘తెలుగు స్టేట్స్‌ ఫోరమ్‌ ఫర్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌’ కోరింది. ఎంఎస్‌ స్థాయిలో ప్రశ్నలు ఇస్తే ఎలా రాయగలమని ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.రవితేజ, ధర్మతేజ సెప్టెంబ‌రు 6న‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రశ్నించారు. ఆగస్టు 31న నిర్వహించిన పరీక్షలో 300 ప్రశ్నలకుగాను 250 దాకా పీజీ తరహాలో ఉన్నాయని, ఇందులో 50 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు గుర్తిస్తారని చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 5 వేల మంది, దేశస్థాయిలో 30 వేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  కటాఫ్‌ మార్కులు 50 శాతానికి బదులు 30 శాతంగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.