• facebook
  • whatsapp
  • telegram

12, 13 తేదీల్లో ఆర్‌ఐఎంసీ పరీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (ఆర్‌ఐఎంసీ) ప్రవేశ పరీక్షను సెప్టెంబ‌రు 12, 13 తేదీల్లో విజయవాడలోని చిల్డ్రన్స్‌ మాంటెస్సోరీ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. 12న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం గణితం, 13న జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్ష ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, సందేహాలుంటే 0866-2527820, 0866-2527821 నంబర్లపై సంప్రదించాలని సూచించింది.