• facebook
  • whatsapp
  • telegram

13న నీట్‌ పరీక్ష..!

‣ 15 లక్షలకు పైగా హాజరుకానున్న విద్యార్థులు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 13న‌ ‘నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)’ పరీక్షను నిర్వహించనున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలను చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య భౌతిక ఎడం పాటించేందుకు పరీక్ష కేంద్రాలను 2,546 నుంచి 3,843కు పెంచినట్లు తెలిపారు. అలాగే ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను 24 నుంచి 12కు తగ్గించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా నీట్‌-2020కి మొత్తం 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా మాస్క్, సానిటైజర్‌తో కేంద్రం వద్దకు రావాలని, అక్కడ ఒక్కో అభ్యర్థికి మూడు పొరలున్న ప్రత్యేక మాస్క్‌లను అందజేస్తారని అధికారులు పేర్కొన్నారు.